సీబీఐ ఎఫెక్ట్: బెంగుళూరుకు సుజనా చౌదరి

By narsimha lodeFirst Published 26, Apr 2019, 11:35 AM IST
Highlights

మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజానా చౌదరి శుక్రవారం నాడు బెంగుళూరుకు బయలుదేరారు. సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు సుజనా  బెంగుళూరు వెళ్లారు.


హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి శుక్రవారం నాడు బెంగుళూరుకు బయలుదేరారు. సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు సుజనా  బెంగుళూరు వెళ్లారు.

2017లో బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసినట్లు బెంగళూరులో సుజనాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా సుజనాకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో  సుజనా చౌదరి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు బెంగుళూరుకు వెళ్లారు.

ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత  తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారనే ఆ పార్టీ నేతలు  తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

సుజనా చౌదరికి సీబీఐ షాక్: విచారణకు హాజరవ్వాల్సిందిగా సమన్లు

Last Updated 26, Apr 2019, 11:36 AM IST