ఎల్వీ సుబ్రమణ్యం దూకుడు, రంగంలోకి బాబు: ఈసీకి 9 పేజీల లేఖ

By Siva KodatiFirst Published Apr 26, 2019, 10:30 AM IST
Highlights

కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 9 పేజీల లేఖలో ప్రభుత్వ శాఖల రివ్యూలపై అభ్యంతరం తేలపడం సరికాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాలపై ఆంక్షలు పెట్టొద్దని లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 9 పేజీల లేఖలో ప్రభుత్వ శాఖల రివ్యూలపై అభ్యంతరం తేలపడం సరికాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాలపై ఆంక్షలు పెట్టొద్దని లేఖలో పేర్కొన్నారు.

సీఎం భద్రత పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీల బదిలీలు ఏకపక్షమని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చేసిన ఫిర్యాదులపై విచారణ లేకుండానే బదిలీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ నిర్వహణలో ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని, దీంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారని సీఎం గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు.

టీడీపీ చేసిన ఏ ఫిర్యాదుపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని.. కానీ వైసీపీ చేసిన ఫిర్యాదులపై వెను వెంటనే నిర్ణయాలు తీసుకున్నారని బాబు ఎద్దేవా చేశారు. ఫిర్యాదులు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలను ఐటీ దాడులతో భయపెట్టారని ఆరోపించారు.

సాధారణ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ప్రజలకు సంబంధించిన కీలక అంశాల్లో వ్యాఖ్యలు చేయడం సీఈవోకు తగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న పలు నిర్ణయాలు ఏక పక్షమని, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు.

ముఖ్యంగా తాగునీటి సమస్య, పోలవరం, రాజధాని నిర్మాణంపై రివ్యూలను తప్పుబట్టడం సరికాదన్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం.. చంద్రబాబును పవర్ లెస్ సీఎం అనడంతో పాటు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈసీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   
 

click me!