అమరావతి రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసు::ముందస్తు బెయిల్‌కి నారాయణ సహా పలువురి పిటిషన్లు

Published : May 18, 2022, 04:13 PM ISTUpdated : May 18, 2022, 04:20 PM IST
అమరావతి రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసు::ముందస్తు బెయిల్‌కి నారాయణ సహా పలువురి పిటిషన్లు

సారాంశం

అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో సీఐడీ దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం పలు సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి.

అమరావతి: Amaravathi రాజధాని రింగ్ రోడ్డు అలైన్‌మెంట్  మార్పు కేసులో AP CID  దాఖలు చేసిన కేసులో Anticipatory Bail కోసం పలు సంస్థలు AP High Court లో బుధవారం నాడు Petiton  దాఖలు చేశాయి.

ఈ కేసులో Lingamaneni సంస్థలకు చెందిన రాజశేఖర్, రమేష్, Ramakrishna హౌసింగ్ అధినేత బాబీ,  మాజీ మంత్రి నారాయణ తదితరులు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిసన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు రేపు విచారించనుంది. 

రాజధాని రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే Alla Ramakrishna Reddy ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 10న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై కేసు నమోదు చేసింది సీఐడీ.

also read:తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ..

ఈ కేసులో  ఏ-1 గా Chandrababu, ఏ-2 గా Narayana, ఏ-2 గా లింగమనేని రమేష్, ఏ-4 గా లింగమనేని శేఖర్ లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీఐడీ. ఏ-5 గా అంజనీకుమార్, ఏ-6 గా హెరిటేజ్ ఫుడ్స్  సహా 14 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీఐడీ.

120బీ, 420, 34, 36,37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగినట్టుగా ఫిర్యాదు అందింది. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి  పిర్యాదు చేశారు. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కల్గించారని ఆరోపణలున్నాయి. 454 కి.మీ పాటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డునున నిర్మించాలని తలపెట్టారు. కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్ రోడ్డు  నిర్మాణాన్ని చేపట్టారు. రాజధానికి వెలుపల లింగమనేని, హెరిటేజ్, జయని ఇన్ ఫ్రా భూములున్నాయి.గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వద్ద హెరిటేజ్ ఫుడ్స్ భూములున్నాయి. 

 ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని ముందస్తు బెయిల్ పిటిషన్లో వారు పేర్కొన్నారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది కాగితాలకే పరిమితమైందన్నారు.ఇన్నర్ రింగ్ అమలు కాలేదని ఆ పిటిషన్లో గుర్తు చేశారు. అంతేకాదు నోటిఫికేషన్ కకూడా ఇవ్వని విసయాన్ని వారు గుర్తు చేశారు. ఊహల ఆధారంగానే రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చడం ద్వారా తమ సంస్థలకు లాభం జరిగిందని  పేర్కొనడం సమంజసంగా లేదని పిటిషనర్లు చెప్పారు. ఈ వాదన హేతుబద్దంగా లేకపోవడంతో పాటు న్యాయ బద్దంగా కూడా లేదని వారు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?