విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి ఆయన ఆరోగ్య స్థితికి సీఎం జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు.
ఏలూరు:విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి ఆయన ఆరోగ్య స్థితికి సీఎం జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు.
డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన వారిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలని ఆమె ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు.
undefined
also read:డాక్టర్ సుధాకర్ రావు మద్యం తాగాడు, మానసిక ఆసుపత్రిలో చికిత్స: కేజీహెచ్ సూపరింటెండ్ అర్జున్
దళిత డాక్టర్ పై దాడి చేయడం, దళితుల నుండి వేలాది ఎకరాల అసైన్డ్ భూములు లాక్కోవడం, దళిత నియోజకవర్గంలో ఉన్న రాజధానిని నాశనం చేయడమేనా వైసీపీ దళితులకు చేస్తున్న మేలు అని ఆమె ప్రశ్నించారు. నాడు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని వైఎస్ఆర్ ఇడుపులపాయకు, హైదరాబాద్ రింగ్ రోడ్డుకు మళ్లించారని ఆమె విమర్శించారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని నవరత్నాలకు మళ్లిస్తున్నారు. ఇదేనా దళితులకు చేస్తున్న మేలు.? వేలాది దళిత కుటుంబాలు వైసీపీ నేతల దాడులకు, దౌర్జన్యాలకు భయపడి ఎక్కడెక్కడో తలదాచుకునే పరిస్థితి కల్పించడమేనా దళితుల సంక్షేమమా అని ఆమె ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో దళితులకు అందే ప్రతి సంక్షేమ పథకాన్ని నిలిపివేయడమేనా దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రేమ.? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలను విడనాడాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని గుర్తుంచుకోవాలని మంత్రి హెచ్చరించారు.