లవ్ లెటర్ ఇచ్చాక డేటింగే: లోకేష్‌కు సీఐడీ నోటీసులపై పేర్నినాని సెటైర్లు

Published : Oct 01, 2023, 01:24 PM IST
 లవ్ లెటర్ ఇచ్చాక డేటింగే: లోకేష్‌కు సీఐడీ నోటీసులపై  పేర్నినాని సెటైర్లు

సారాంశం

లవ్ లెటర్ ఇచ్చాక  డేటింగ్ ఉంటుందని లోకేష్ కు సీఐడీ నోటీసులపై  మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.  

అమరావతి: లవ్ లెటర్ ఇచ్చాక డేటింగ్ ఉంటుందని  లోకేష్ కు  ఏపీ సీఐడీ నోటీసులపై  మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు  ఏపీ సీఐడీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై  ఏపీ సీఐడీ లవ్ లెటర్ ఇచ్చిందని  లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై  మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆదివారంనాడు తాడేపల్లిలో  మీడియాతో మాట్లాడారు.

లవ్ లెటర్ ఇచ్చాక డేటింగ్ ఉంటుందన్నారు. డేటింగ్ తర్వాత  వెడ్డింగ్ ఉంటుందన్నారు.  ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  ఏపీ హైకోర్టులో  లోకేష్  ముందస్తు బెయిల్ కోరుతూ  పిటిషన్ దాఖలు చేశారు. అయితే 41 ఏ సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చి  విచారణ చేయాలని ఏపీ హైకోర్టు  సీఐడీని ఆదేశిస్తూ  గత నెల 29వ తేదీన  ఆదేశించింది. దీంతో గత నెల  30వ తేదీన సీఐడీ అధికారులు నిన్న  న్యూఢిల్లీలో  లోకేష్ కు  నోటీసులు  జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన విచారణకు రావాలని  సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. అదే రోజున  ఏపీ ఫైబర్ గ్రిడ్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో  లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ కూడ ఏపీ హైకోర్టులో ఉంది.  

also read:ఎన్టీఆర్‌కు బాబు ఏం చేశాడో... కేసీఆర్‌కు కూడా అదే చేస్తాడు: హరీష్‌కు పేర్నినాని కౌంటర్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత  లోకేష్ న్యూఢిల్లీకి వెళ్లారు.న్యాయ నిపుణులతో చర్చించడంతో పాటు  చంద్రబాబు అరెస్ట్ పై  దేశంలోని పలు పార్టీల నేతలను లోకేష్ కలుస్తున్నారు.   ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  సుప్రీంకోర్టులో ఈ నెల 3వ తేదీన  సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ విచారణ తర్వాత  లోకేష్  ఏపీకి వచ్చే అవకాశం ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu