చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణ మంత్రి హరీష్ రావు ఖండించడంపై ఏపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బాబు బాటలోనే హరీష్ రావు నడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఎన్టీఆర్ కు బాబు చేసిందే కేసీఆర్ కు హరీష్ రావు చేస్తాడని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.ఆదివారంనాడు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణ మంత్రి హరీష్ రావు ఖండించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు మాజీ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకు వచ్చారు. హరీష్ రావు కేసీఆర్‌కు ఏమౌతారని ఆయన అడిగారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏమౌతారన్నారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏం చేశారో... కేసీఆర్ కు కూడ హరీష్ రావు కూడ అదే చేస్తారని పేర్ని నాని చెప్పారు.ఈ అల్లుళ్ల గిల్లుళ్లు ప్రజలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. 2018లో కేసీఆర్ నే హరీష్ రావు గిల్లాడు కదా.. అని ఆయన ప్రశ్నించారు.ఈ కారణంగానే 2018 ఎన్నికల తర్వాత హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టారన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ ను దురదృష్టకరమని తెలంగాణ మంత్రి హరీష్ రావు నిన్న వ్యాఖ్యానించారు. పాపం ఈ వయస్సులో చంద్రబాబును అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు తీసుకోవచ్చని రాష్ట్రంలో జరిగిన అభివృద్ది గురించి బాబు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో కూడ ఏపీ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేస్తే మాజీ మంత్రి పేర్ని నాని ఇదే రీతిలో సమాధానం ఇచ్చారు. కేసీఆర్ ను తిట్టించడం కోసమే ఏపీ పై హరీష్ రావు విమర్శలు చేస్తున్నారన్నారు.
undefined
also read:చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పడు: చంద్రబాబు కేసులపై పేర్ని నాని
2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు.ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. హరీష్ ను పార్టీలో పక్కన పెడుతున్నారనే అప్పట్లో అంతా ప్రచారం సాగింది. కానీ హరీష్ రావు పార్టీలో కీలకంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్ధుల జాబితా ప్రకటించే సమయంలో అసంతృప్తులను బుజ్జగించే ప్రక్రియలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.