బాబాయి జయంతిని అబ్బాయిలు మర్చిపోయినట్టున్నారు.. అదైతే గుర్తుంటుంది: జగన్‌పై లోకేష్ సెటైర్లు

Published : Aug 08, 2023, 01:29 PM IST
బాబాయి జయంతిని అబ్బాయిలు మర్చిపోయినట్టున్నారు.. అదైతే గుర్తుంటుంది: జగన్‌పై లోకేష్ సెటైర్లు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శలు గుప్పించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శలు గుప్పించారు. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి జయంతి అని.. అయితే అబ్బాయిలు మరిచిపోయినట్టుగా ఉన్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వేటు వేసిన చేతితోనే బాబాయ్ జయంతికి ట్వీట్ వేస్తే బాగోదనేమోనని వేయలేదని అన్నారు. వివేకానందరెడ్డి కూతురు సునీత చేస్తున్న న్యాయపోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానని కూడా పేర్కొన్నారు. 

ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్ చేశారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరిస్తున్న వీడియోను కూడా లోకేష్ షేర్ చేశారు. ఆ సమయంలో సునీత కూడా జగన్ పక్కనే ఉన్నారు. 

 

 ‘‘ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి జ‌యంతి, అబ్బాయిలు మ‌రిచిపోయిన‌ట్టున్నారు. వీరికి బాబాయ్‌ జ‌యంతి గుర్తుండ‌దు కానీ వ‌ర్థంతి మాత్రం డేట్, టైముతో స‌హా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతుల‌తోనే బాబాయ్ జ‌యంతికి ట్వీటు వేస్తే బాగోద‌నేమో వేయ‌లేదు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాల‌కి ఎదురొడ్డి సోద‌రి సునీత గారు చేస్తున్న న్యాయ‌పోరాటంలో త‌ప్ప‌క గెలుస్తారు. త‌న తండ్రిని చంపిన క‌న్నింగ్ క‌జిన్స్‌తో జైలు ఊచ‌లు లెక్క‌పెట్టించే వ‌ర‌కూ విశ్ర‌మించ‌రు. వివేకానంద‌రెడ్డి గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని నారా లోకేష్ ట్వీట్  చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YSRCP Leaders Protest at ABN Office: ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ నాయకులు| Asianet Telugu
MP Ambica G Lakshminarayana Speech: అనంతపూర్ ఎంపీ అంబికా పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu