
రాజమండ్రి : పెట్రోల్ బంక్ పక్కనేవున్న బాణాసంచా గోడౌన్ లో మంటలు అంటుకుని భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తూ.గో జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో పెట్రోల్ బంక్ పక్కనే ఓ బాణాసంచా గోడౌన్ వుంది. ఈ గోడౌన్ భారీఎత్తున పేలుడు పదార్థాలను నిల్వవుంచిన సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాడికి భూకంపం ఏమైనా వచ్చిందా అన్నట్లుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగుతీసారు.
వీడియో
అయితే ఈ పేలుళ్ళలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పొరపాటున పేలుడు జరిగిన గోడౌన్ పక్కనేవున్న పెట్రోల్ బంక్ కు మంటలు అంటుకుంటే పెనుప్రమాదం సంభవించేదని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా పెట్రోల్ బంక్ పక్కనే బాణాసంచా గోడౌన్ ఏర్పాటుచేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More సత్తెనపల్లిలో వైసిపి, జనసేన నాయకుల బాహాబాహీ... తీవ్ర ఉద్రిక్తత (వీడియో)
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. స్థానిక పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.