తమకు స్టైఫండ్ ను పెంచాలని జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ నెల 15న జూడాలు సమ్మె నోటీసిచ్చారు. గతంలో కూడ జూడాలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన నిర్వహించారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ప్రభుత్వనికి సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుండి స్పష్టత రాకపోతే ఈ నెల 26 నుండి ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.ఈ నెల 26 నుండి ఓపీ సేవలను బహిష్కరించాలని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.ఈ నెల 27 నుండి అత్యవసరం కానీ సేవలను బహిష్కరించనున్నారు.తమకు న్యాయబద్దంగా ఇవ్వాల్సిన స్టైఫండ్ ను ఇవ్వాలని కోరుతున్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్టైఫండ్ ను పెంచలేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నుండి స్టైఫండ్ ను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని జూనియర్ డాక్టర్లు గుర్తు చేస్తున్నారు.కానీ ఈ ఏడాది జనవరి నుండి కూడా స్టైఫండ్ నె పెంచలేదని జూనియర్ డాక్టర్లు అసంతృప్తితో ఉన్నారు.స్టైఫండ్ పెంపుతో పాటు ఇతర డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మెనోటీసుును అందించారు.ఈ నెల 25 వ తేదీ వరకు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వాసుపత్రుల వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఇవాళ విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందిస్తున్న స్టైఫండ్ ను ఏపీ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. తమకు 15 శాతం స్టైఫండ్ ను పెంచుతామని అధికారుల నుండి సానుకూలంగా స్పందన వచ్చిందన్నారు.కానీ ఎప్పటినుండి పెంచుతారో కూడ స్పష్టత రాలేదని జూనియర్ డాక్టర్లు చెప్పారు.