తప్పిన ప్రమాదం: కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు,40 మంది సేఫ్

Published : Oct 21, 2022, 10:15 AM ISTUpdated : Oct 24, 2022, 05:51 PM IST
 తప్పిన ప్రమాదం: కృష్ణా  జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు,40 మంది సేఫ్

సారాంశం

ఉమ్మడి  కృష్ణా  జిల్లా  పెద్దపారుపూడి మండలం పులపర్తిగూడెం వద్ద శుక్రవారం నాడు ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో బస్సులో 40 మంది  ప్రయాణీకులున్నారు.  

విజయవాడ: ఉమ్మడి కృష్ణా  జిల్లా పెదపారుపూడి మండలం  మండలం పులపర్తిగూడం వద్ద శుక్రవారం నాడు  ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించాయి.  మంటలను గుర్తించిన  ప్రయాణీకులు వెంటనే   బస్సు నుండి దిగారు.  బస్సులో మంటలు వ్యాపించిన  సమయంలో  బస్సులో 40 మంది ప్రయాణీకులున్నారు.మంటలను గుర్తించిన వెంటనే బస్సును నిలిపివేసి  ప్రయాణీకులు దిగిపోవడంతో పెద్ద  ప్రమాదం  తప్పింది. 

సాంకేతిక లోపం కారణంగానే బస్సులో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని  సిబ్బంది  ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.అంతేకాదు  బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. బస్సులో మంటలు వ్యాపించడానికి గల కారణాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేయనున్నారు. విజయవాడ నుండి బస్సు గుడివాడ  వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం  చోటుచేసుకుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు లోడింగ్... తెలంగాణలో 10, ఏపీలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు
దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli