గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో తనపై చంద్రబాబు చేసిన విమర్శలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు. గుడివాడ అభివృద్ది కోసం చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు
గుడివాడ:చంద్రబాబు ఎందరిని కలుపుకుని వచ్చినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పదని మాజీ మంత్రి కొడాలి నాని ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరో సారి విజయం సాధించనుందన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాము చేసిన అభివృద్దిని చూసి ఓటేయాలని ప్రజలను కోరితే 2009లో ప్రజలు ఆశీర్వదించారన్నారు. 2009లో మహాకూటమి పేరుతో పోటీ చేసిన చంద్రబాబును ప్రజలు ఓడించారన్నారు. 2024లో కూడా 2009 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. జగన్ ప్రభంజనం ముందు టీడీపీ, జనసేన నిలబడవని ఆయన చెప్పారు.
undefined
గుడివాడలో శుక్రవారంనాడు మాజీ మంత్రి కొడాలినాని మీడియాతో మాట్లాడారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన సమయంలో చంద్రబాబు చేసిన విమర్శలై కొడాలి నాని కౌంటరిచ్చారు. సీఎంగా ఉన్నప్పుడు గుడివాడ అభివృద్ది కోసం చంద్రబాబునాయుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గుడివాడను చంద్రబాబు గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబునాయుడు గుడివాడలో ప్రచారం చేసిన ప్రతిసారీ టీడీపీ ఓటమి పాలైందని మాజీ మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు.
గుడివాడ నియోజకవర్గంలో పేదల ఇళ్ల కసం చంద్రబాబు ఒక్క ఎకరం భూమిని కొనుగోలు చేశాడా అని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ అలా నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. అంబేద్కర్ జయంతి రోజు చంద్రబాబు గురించి మాట్లాడడం సరైంది కాదన్నారు.
నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహలను చంద్రబాబు పెట్టలేదన్నారు. నిమ్మకూరులో తాను , జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహలను ఏర్పాటు చేశామన్నారు ఈ విగ్రహల కోసం తాము రూ. 60 లక్షలను ఖర్చు పెట్టామన్నారు.
నిమ్మకూరు అభివృద్ది కోసం హరికృష్ణ రూ. 14 కోట్లు ఇచ్చిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు. నిమ్మకూరుపై ప్రేమ ఉంటే సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు నిమ్మకూరును అభివృద్ది చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
నిమ్మకూరు అభివృద్దిపై హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న చిత్తశుద్ది చంద్రబాబుకు లేదన్నారు. 42 ఏళ్ల తర్వాత అత్తారింటికి వెళ్లిన చంద్రబాబు బస్సులో పడుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిమ్మకూరులో ఉన్న ఇల్లును కూడ హరికృష్ణ కట్టించేదే అని కొడాలి నాని గుర్తు చేశారు.
చంద్రబాబు 420 కాబట్టే తన ఆస్తిని రూ. 20 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారన్నారు. చంద్రబాబు తన భార్య ఆస్తుల్ని కలిపి ఎందుకు చెప్పలేదని కొడాలి నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ తన భార్య భారతి ఆస్తి కలుపుకుని ఎన్నికల అఫిడవిట్ లో చూపారని కొడాలి నాని చెప్పారు.