ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ చేయించాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
అమరావతి: ఎన్టీఆర్ మరణం పై సీబీఐ విచారణ చేయించాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని కలసి ఫిర్యాదు చేస్తామని నాని చెప్పారు.
శనివారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మరణం తరువాత అన్ని చంద్రబాబుకే అనుకూలంగా జరిగిని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం వివేకానందరెడ్డి చనిపోతే జగన్ కి ఏమి కలసి రాలేదన్నారు. ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ చేయించాలని ఆనాడు మంత్రిగా ఉన్న హరికృష్ణ డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ మరణంపై ఎందుకు సీబీఐ విచారణ చేయించలేదో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు.
undefined
మరణించిన సమయంలో ఎన్టీఆర్ శరీరం ఎందుకు నల్లగా అయ్యిందో చెప్పాలన్నారు..ఎన్టీఆర్ మృతదేహానికి పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదని ఆయన అడిగారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రమాదాలు , గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయని కొడాలి నాని ప్రశ్నించారు. సినీ నటుడు తారక రత్న పాదయాత్ర చేసి, పోటీ చేస్తానన్నాడన్నారు. అయితే తారకరత్నకు వెంటనే గుండెపోటు వచ్చిందన్నారు.
also read:వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున బాబు కాల్ రికార్డులపై సీబీఐ విచారణ: కొడాలి నాని డిమాండ్
లోకేష్ కి ఉన్న సెక్యూటీ నందమూరి తారక రత్న ఎందుకు లేదో అర్ధం కావడం లేదన్నారు. లోకేష్ కోసం 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ తారకరత్నకి సెక్యూరిటీని ఎందుకు పెట్ట లేదని నాని అడిగారు. నందమూరి కుటుంబం వరుసగా ప్రమాదాలకు గురి కావడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. . దీనిపై కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయాలు చిన్న చిన్నవిగా కొడాలి నాని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమన్నారు.