జూ. ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్లినా లాభం లేదు.. ఆ సీబీఐ అధికారుల్లో టీడీపీ మద్దతుదారులు: లక్ష్మీపార్వతి

Published : Feb 04, 2023, 01:14 PM IST
జూ. ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్లినా లాభం లేదు.. ఆ సీబీఐ అధికారుల్లో టీడీపీ మద్దతుదారులు: లక్ష్మీపార్వతి

సారాంశం

వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్లినా లాభం లేదని అన్నారు.

వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్లినా లాభం లేదని అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. పూర్తిగా పగ్గాలు తీసుకుని ఐదేళ్ల పాటు రాజకీయాల్లో శిక్షణ పొంది.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌లా జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు అవకాశం ఉండొచ్చని అన్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారుల్లో టీడీపీ మద్దతుదారులు ఉన్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఎన్నికలకు ముందు అసమ్మతులు సాధారణం అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీతో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించారు. రాజధాని పేరుతో టీడీపీ చేసిన పాదయాత్రకు కోటంరెడ్డి సాయం చేశాడని ఆరోపణలు  చేశారు. 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations