
హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్ బాషా మంగళవారం నాడు హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు. ఎల్లుండి ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఖలీల్ బాషా గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడ పనిచేశారు.మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో కడప నుండి ఆయనకు పోటీచేసే అవకాశం వస్తోందో లేదో అనే అనుమానం నెలకొంది.
ఈ తరుణంలోనే ఖలీల్ బాషా టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు. మంగళవారం నాడు ఖలీల్ బాషా జగన్‌ను కలిశారు..ఎల్లుండి కడపలో జగన్ సమక్షంలో ఖలీల్ బాషా టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు.
సంబంధిత వార్తలు
చంద్రబాబుకు మరో దెబ్బ: వైసీపీలోకి మాజీ మంత్రి