ఏబీఎన్ రాధాకృష్ణపై నాగబాబు సెటైర్లు

Published : Feb 05, 2019, 04:29 PM ISTUpdated : Feb 05, 2019, 04:35 PM IST
ఏబీఎన్ రాధాకృష్ణపై నాగబాబు సెటైర్లు

సారాంశం

మెగా బ్రదర్ నాగబాబు నా చానెల్ నా ఇష్టం పేరిట ఓ యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసి రోజుకో వీడియో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు చంద్రబాబు, లోకేష్, జగన్ లను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా.. ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సెటైర్లు వేసారు.

మెగా బ్రదర్ నాగబాబు నా చానెల్ నా ఇష్టం పేరిట ఓ యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసి రోజుకో వీడియో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు చంద్రబాబు, లోకేష్, జగన్ లను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా.. ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సెటైర్లు వేసారు.

ఏబీఎన్ ఛానలో ప్రసారం చేసిన ఒక కథనంలో లోకేష్ ని ఆకాశానికి ఎత్తేస్తూ.. ప్రధాని నరంద్ర మోదీ ఏపీకి వస్తున్న నిధులను అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేశారు. అయినా కూడా బిజినెస్ పీపుల్ అంతా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎగబడుతున్నారు అన్నట్టుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఒక కథనాన్ని ఆమధ్య ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ కథనం మీద వ్యంగ్య బాణాలు సంధిస్తూ నాగబాబు ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనంపై నాగబాబు సెటైర్లు వేశారు. లోకేష్ ని ఆకాశానికెత్తుతూ ప్రసారం చేసిన కథనం మొదలవగానే వచ్చే దద్దరిల్లి పోయే రీరికార్డింగ్ సౌండ్ చూస్తూ, “ఆహా ఇది ఆర్ ఆర్ అంటే, ఇలా ఉండాలి” అంటూ వెటకారం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పెట్టుబడులను పనిగట్టుకుని మోదీ నిలిపేస్తున్నాడు అన్న వ్యాఖ్యలపై కూడా “మోదీ గారికి మరియు పని లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పెట్టుబడి లన్ని ఆపేయడం బాగోలేదు ” అంటూ వెటకారంగా స్పందించారు. 

అలాగే మోదీని కాదని సైతం పెట్టుబడిదారులు అందరూ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగా వేల కోట్లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారు అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. “అబ్బా సూపర్, అసలు ఇంత గొప్పగా ఉంటే ఇంకా స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు అంత పాకులాడాల్సిన అవసరం కూడా లేదు ఏమో” అంటూ చెణుకులు విసిరారు.

అన్నింటికంటే ముఖ్యంగా, “ఇంత పెద్ద కథనాన్ని ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి ఇంతకీ ఆ అపర కుబేరుడు అయిన బిజినెస్ మాన్ పేరేమిటో ఎందుకు చెప్పలేదబ్బా ” అంటూ అసలు ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం మొత్తం ఫేక్ ఏమో అన్న అనుమానాలు రేకెత్తించేలా సెటైర్ వేశారు. 


 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu