
పెదపాడు : మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత Garapati Sambhasivarao(75) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడు గూడెంలోని స్వగృహంలో అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా సాంబశివరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సాంబశివరావు మృతిపట్ల తేదేపా అధినేత chandrababu naidu సంతాపం తెలిపారు.
ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పారు. సాంబశివరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు సాంబశివరావు మృతిపట్ల దెందులూరు అబ్బయ్య చౌదరి సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహం వద్ద ఎమ్మెల్యే నివాళులర్పించారు.