AP Capital: జ‌గ‌న్ స‌ర్కార్ కు కేంద్రం షాక్.. రాజ‌ధాని అమ‌రావ‌తే!

Published : Feb 02, 2022, 12:36 PM IST
AP Capital: జ‌గ‌న్ స‌ర్కార్ కు కేంద్రం షాక్.. రాజ‌ధాని అమ‌రావ‌తే!

సారాంశం

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేన‌ని, రాజ‌ధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర‌ప్ర‌భుత్వానిదేన‌ని కేంద్రం స‌మాధానమిచ్చింది.    

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో బుధవారం ఆసక్తికరమైన చర్చ జ‌రిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలంటూ.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్ర‌శ్నించారు. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని, ఏపీ రాజధాని ఏది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అని  రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు ప్ర‌శ్నించారు. 

ఆయ‌న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే అన్నారు. రాజ‌ధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర‌ప్ర‌భుత్వానిదేన‌ని  కేంద్రమంత్రి నిత్యానందరాయ్ స‌మాధానమిచ్చారు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని స్పష్టం చేశారు.

పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజ‌ధాని కర్నూలు, శాసన రాజ‌ధాని అమరావతి అని తర్వాత చెప్పారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu