ఏడేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష...

Published : Feb 02, 2022, 12:50 PM IST
ఏడేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష...

సారాంశం

2016 మార్చి 19వ తేదీ సాయంత్రం స్నేహితులతో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికకు Chocolate ఇస్తానని ఆశచూపిన నిందితుడు టెర్రస్ మీదికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను court విచారించింది. నిందితుడి మీద నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష, జనిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

విజయవాడ : ఏడేళ్ల బాలిక పట్ల absence behave చేసిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కమ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్. రజని మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో బాధత బాలిక కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 

నిందితుడు షేక్ బాజీ (44) అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2016 మార్చి 19వ తేదీ సాయంత్రం స్నేహితులతో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికకు Chocolate ఇస్తానని ఆశచూపిన నిందితుడు టెర్రస్ మీదికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను court విచారించింది. నిందితుడి మీద నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష, జనిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

ఇదిలా ఉండగా, Sexual harassmentలతో బాలికను చిదివేసిన tdp leader వినోద్ జైన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల ఎదుట విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లోని లోటస్ లెజెండ్ అపార్ట్ మెంట్ లో టిడిపి నేత vinod jain లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక suicideకు పాల్పడిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.  దీనిపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతురాలు  suicide noteలో పేర్కొన్నట్లుగా తాను రెండు నెలలుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. 

ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని.. స్కూలుకు వెళ్లి, వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించే వాడినని చెప్పుకొచ్చాడు. తాను చేసింది తప్పే అని.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని... వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది.  మరోవైపు..  ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. చిన్నవయసులోనే  కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ చిన్నారి.. అమ్మా,నాన్న,తమ్ముడు గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. 

ఇక, vijayawadaలో కామాంధుడి Sexual harassment తాళలేక suicide చేసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తలుచుకుంటూ తల్లడిల్లి పోతున్నారు. దీక్షిత ఫోటోను దగ్గర పెట్టుకుని,  చూసుకుంటూ  కన్నీటి పర్యంతం అవుతున్నారు. CCTV footage లోని  దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. దుర్మార్గుడిని నడిరోడ్డుపై encounter చేయండి అని రోదిస్తున్నారు. మరో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడాలని,  తమకు ఎదురైన కష్టం మరొకరికి రాకూడదంటూ వేడుకుంటున్నారు. 

తనకు ఇష్టమైన రంగు డ్రెస్ వేసుకుని, వాకింగ్ కి వెళ్లేముందు హగ్ చేసుకుందని, కరోనా కేసులు పెరిగిపోతున్నాయని..  వాకింగ్ కి  వెళ్లవద్దని చెప్పానని..  అయినా వెళ్లి వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది అని బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతోంది.  మెట్లు, లిఫ్ట్ దగ్గర ఉండి నిందితుడు విష్ చేసేవాడని, వయసు రీత్యా తమకు అనుమానం రాలేదని తల్లిదండ్రులు చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu