ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమర్థించారు. పార్టీ మాత్రం మూడురాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
విశాఖపట్టణం: విశాఖను వాణిజ్య రాజధాని చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనను టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమర్ధించారు. గతంలో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని సమర్ధించిన గంటా శ్రీనివాసరావు శుక్రవారం నాడు ఈ విషయమై తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా పంచుకొన్నారు.
Also read: ఏపీకి మూడు రాజధానులు: రెండో రోజూ రైతుల నిరసనలు
మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనను సమర్ధిస్తూ ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
Also read: ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు
శుక్రవారం నాడు గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన సమయంలో కూడ తాను విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయాలని కూడ తాను డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Also read: నేడు జగన్‌కు రాజధానిపై నిపుణుల కమిటీ తుది నివేదిక
విశాఖను రాజధానిని ఏర్పాటు చేయాలని కోరినట్టుగా ఆయన తెలిపారు. ఎవరు ఏమనుకొన్నా కూడ విశాఖను రాజధాని చేయడమే సరైన నిర్ణయంగా ఆయన చెప్పారు. కర్నూల్‌లో జ్యూడీషీయల్ కేపిటల్ ఏర్పాటు, లెజిస్లేచర్ కేపిటల్, విశాఖను వాణిజ్య రాజధాని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమర్ధించారు.
Also read:ఏపీకి మూడు రాజధానులు : పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి...
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయమై టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కర్నూల్ ను జ్యూడీషీయల్ రాజధాని చేసే విషయాన్ని మాజీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మద్దతు పలికారు. మరో టీడీపీ నేత కూడ ఇదే బాటలో నడిచారు.
Also read:రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
విశాఖను వాణిజ్య రాజధానిగా చేయడాన్ని గంటా శ్రీనివాసరావుతో పాటు మాజీ మంత్రి కొండ్రు మురళి కూడ సమర్థించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మూడు రాజధానుల విషయంలో టీడీపీ నేతలు ఎవరూ కూడ బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలను ఆదేశించారు.