దాడి సమయంలో పోలీసులు రెండు కి.మీ. దూరంలోనే ఉన్నారు : దేవినేని ఉమ

By AN TeluguFirst Published Aug 5, 2021, 3:34 PM IST
Highlights

అక్రమ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకుంటే దాడిచేసి అరెస్టు చేశారని ఉమా చెప్పుకొచ్చారు. దాడి సమయంలో దాదాపు ఏడెనిమిది గంటలు తాను కారు నుంచి బయటకు రాలేదని  దేవినేని ఉమ తెలిపారు. రాష్ట్రంలోని న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాయన్నారు. 

రాజమండ్రి : తనపై దాడి జరిగిన సమయంలో పోలీసులు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గురువారం బెయిల్పై విడుదలైన తర్వాత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భయపడేది లేదని చెప్పారు.

చంద్రబాబు, అచ్చె న్నాయుడుతో పాటు టిడిపి నేతలు మద్దతు ఇచ్చి దైర్యం చెప్పారని  దేవినేని ఉమ అన్నారు.  అక్రమ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకుంటే దాడిచేసి అరెస్టు చేశారని ఉమా చెప్పుకొచ్చారు. దాడి సమయంలో దాదాపు ఏడెనిమిది గంటలు తాను కారు నుంచి బయటకు రాలేదని  దేవినేని ఉమ తెలిపారు. రాష్ట్రంలోని న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాయన్నారు. 

తనకు బెయిల్ మంజూరు అయిన సందర్భంగా న్యాయవ్యవస్థ కు ధన్యవాదాలు తెలిపారు. బెయిల్పై విడుదలైన ఉమామహేశ్వరరావుకు పలువురు టీడీపీ నేతలు అమరావతి జేఏసీ నాయకులు స్వాగతం పలికారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల సందర్భంగా పలువురు టిడిపి నేతలు ఆయనను పరామర్శించేందుకు జైలు వద్దకు వచ్చారు.  అయితే జైలు వద్దకు వచ్చిన టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు దుర్మార్గం అంటూ  టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారని ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని బుచ్చయ్యచౌదరి విమర్శించారు. 

click me!