రేపటిలోగా పులిచింతల ప్రాజెక్ట్‌ను గేట్‌ను బిగించే అవకాశం వుందన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గేట్ ఊడిపోవడంపై ఎక్స్‌పర్ట్ కమిటి వేశామని తెలిపారు. ఫ్లడ్ వాటక్ వస్తుండటంతో అదికారులను అప్రమత్తం చేశామని మంత్రి పేర్కొన్నారు
పులిచింతల ప్రాజెక్ట్ గేట్ విరిగిపోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగత తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గేట్ ఊడిపోవడంపై ఎక్స్‌పర్ట్ కమిటి వేశామని తెలిపారు. ఫ్లడ్ వాటర్ వస్తుండటంతో అదికారులను అప్రమత్తం చేశామని మంత్రి పేర్కొన్నారు.
Also Read:పులిచింతలకు మంత్రి అనిల్: పోలవరం నుండి నిపుణుల రాక, గేటు బిగింపుపై కసరత్తు
ఐదు లక్షల క్యూసెక్కుల నీరు కిందకి వదులుతున్నామని.. పోలవరం నుంచి నిపుణులు వస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. రేపటి లోగా గేట్ ను బిగించే అవకాశం వుందని స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. 10 టీఎంసీల నీరు తగ్గితే గేట్ మరమ్మత్తులు చేసే అవకాశం వుందన్నారు. ప్రమాదంపై ఎక్స్‌పర్ట్ కమిటి వేశామని సూర్యనారాయణ పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు విరిగిపోయింది. రెండు అడుగుల మేర గేటును ఎత్తే సమయంలో గేటు విరిగిపోయింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు నుండి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. పులిచింతల నుండి దిగువకు భారీగా వరద నీరు వస్తున్ననేపథ్యంలో నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.