
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు ప్రయత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును మంగళవారం నాడు ఉదయం అరెస్ట్ చేశారు. విజయవాడ గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
సోమవారం నాడు మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపీణీ కార్యక్రమం సందర్భంగా ఏపీ మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తానని హెచ్చరించారు.
వీడియో
ఈ వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహాం వద్ద దీక్షకు దిగుతానని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోమవారం నాడు సాయంత్రం ప్రకటించారు. అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహాం వద్ద తాను కూర్చొంటాను.. టచ్ చేసి చూడాలని సీఎం జగన్ కు ఏపీ మంత్రి కొడాలి నానికి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాల్ విసిరారు.
also read:టచ్‌చేసి చూడు: మంత్రి కొడాలి నానికి మాజీ మంత్రి దేవినేని సవాల్
మాజీ మంత్రి దేవినేని ఉమా పోలీసుల కళ్లుగప్పి ఇవాళ ఉదయం పది గంటల సమయంలో ఎన్టీఆర్ విగ్రహాం వద్దకు చేరుకొన్నారు. ముఖానికి మాస్క్, తలపై టోపీ పెట్టుకొని ఎన్టీఆర్ విగ్రహాం వద్దకు చేరుకొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహాం వద్ద ధర్నాకు ప్రయత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదని పోలీసులు దేవినేని ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేశారు.