వివాహేతర సంబంధం.. గుడివాడ టూ టౌన్ ఎస్ఐ ఆత్మహత్య

Published : Jan 19, 2021, 08:18 AM IST
వివాహేతర సంబంధం.. గుడివాడ టూ టౌన్ ఎస్ఐ ఆత్మహత్య

సారాంశం

హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. 

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కాగా... విజయ్ కుమార్ బలవన్మరణానికి వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఆయనకు మూడు నెలల క్రితం వివాహం కాగా.. భార్యను కాపురానికి తీసుకురాకుండా.. గుడివాడలో బ్యూటీషియన్‌తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

నెల్లూరు మేయర్ గా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ | Roop Kumar Yadav Wins Big as Nellore Mayor
Pawan Kalyan : పవన్ 100% స్ట్రైక్ రేట్ ఫామ్ కంటిన్యూ.. జనసేన గెలిచిన స్థానాలివే, విజేతలు వీళ్లే