వైఎస్సార్ వల్లే బాలకృష్ణ ఓ కేసు నుంచి బయటపడ్డారు.. : మాజీ మంత్రి అనిల్ కుమార్

By Sumanth KanukulaFirst Published Sep 26, 2022, 2:44 PM IST
Highlights

ఎన్టీఆర్ నిజమైన అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉండరని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడకు దమ్ముంటే ఎన్టీఆర్ ఫొటో పక్కనపెట్టి ప్రజల్లోకి రావాలని సవాలు విసిరారు.

ఎన్టీఆర్ నిజమైన అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉండరని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడకు దమ్ముంటే ఎన్టీఆర్ ఫొటో పక్కనపెట్టి ప్రజల్లోకి రావాలని సవాలు విసిరారు. ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ కేసు నుంచి బయటపడింది వైఎస్సార్ పుణ్యమేనని అన్నారు. నందమూరి వంశం పోరాడాల్సింది పేరు మార్చడంపై కాదని.. టీడీపీని స్వాధీనం చేసుకునేందుకు పోరాడాలని అన్నారు. 

ఇక, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం గత కొద్దిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులు, విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మంత్రలు, వైసీపీ ఎమ్మెల్యేలు.. వర్సిటీ పేరు మార్పు అంశాన్ని సమర్ధించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు.. హెల్త్ వర్సీటీ పేరు మార్పుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. 

అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్‌లు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పెద్ద యుద్దమే సాగుతుంది.  

ఇక, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. అది ఎన్టీఆర్‌పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా?.. వర్సిటీకి ఉండాలా? అంటే తాను జిల్లాకే ఉండాలని కోరుకుంటానని చెప్పారు. జిల్లా పెద్దదని.. యూనివర్సిటీ చాలా చిన్నదని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంలోనే వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వొద్దని వాజ్‌పేయికి చంద్రబాబు నాయుడే చెప్పారని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని విమర్శించారు.

click me!