వివేకానందరెడ్డి హత్య కేసు: శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

By Sumanth KanukulaFirst Published Sep 26, 2022, 1:56 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు  తిరస్కరించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు  తిరస్కరించింది. వివరాలు.. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శివశంకర్ రెడ్డి కూడా నిందితునిగా ఉన్నారు. శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 

దీంతో శివశంకర్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణామురారితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

Also Read: వివేకానందరెడ్డి హత్య కేసు‌: సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ.. సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. 

click me!