ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ..

By Sumanth KanukulaFirst Published Sep 26, 2022, 2:33 PM IST
Highlights

ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉంటున్నారు. అయితే బెయిల్ కోసం అనంతబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

డ్రైవర్ హత్యకేసులో పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనందున అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇదిలా ఉంటే.. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను ఇటీవల రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. అనంతబాబు రిమాండ్‌ను అక్టోబర్ 7 వరకు పొడగిస్తూ ఉత్తర్వుల జారీచేసింది. 

ఇక, గత నెలలో అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అవకాశం కల్పించింది. అనంతబాబుకు మూడు రోజుల పాటు షరత్‌లతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 25 వేల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. మూడు రోజులు అతడి స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రావద్దని ఆదేశించింది. పోలీసు

click me!