సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని

By narsimha lodeFirst Published Sep 10, 2019, 2:07 PM IST
Highlights

గురజాల మాజీ  ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు టీడీపీ శిబిరంలో మంగళవారం నాడు ప్రత్యక్షమయ్యారు. 

గుంటూరు: సరస్వతి సిమెంట్ భూముల  కోసమే తనపై కేసులు పెట్టారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఎట్టకేలకు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతం వీడారు.

మంగళవారం నాడు గుంటూరులోని టీడీపీ శిబిరానికి యరపతినేని శ్రీనివాసరావు వచ్చారు. చాలా కాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పల్నాడులో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. అక్రమ కేసులు,దాడులతో  వేధింపులకు పాల్పడుతున్నారని  ఆయన ఆరోపించారు.

తాను ఎక్కడికి పారిపోలేదని ఆయన స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణను తాను స్వాగతిస్తున్నట్టుగా యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు.అంబటి రాంబాబు చెప్పినట్టుగా 15 ఏళ్ల నుండి మైనింగ్ విషయంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అక్రమ మైనింగ్  కేసు విషయమై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నాటి నుండి యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లాడు. సీబీఐ విచారణ విషయమై న్యాయ నిపుణుల సలహలు తీసుకొంటున్నాడనే ప్రచారం సాగింది. మంగళవారం నాడు ఆకస్మాత్తుగా  గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో యరపతినేని ప్రత్యక్షమయ్యారు.
 

సంబంధిత వార్తలు

యరపతినేని అక్రమ తవ్వకాలపై సిబిఐ దర్యాప్తు: జగన్ కీలక నిర్ణయం

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి

అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు

click me!