ఏపీలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు:రేపు తెలంగాణలో వర్షాలు కురిసే చాన్స్

By narsimha lode  |  First Published May 16, 2022, 6:25 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈదురు గాలులతో కూడి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి.


అమరావతి: Andhra Pradesh రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం నాడు Heavy Rains కురిశాయి. రాష్ట్రంలోని  Kurnool, కడప, Tirupatiలో భారీ వర్షాలు కురిశాయి. కుప్పం బస్టాండ్ సమీపంలో భారీ వృక్షం కుప్ప కూలింది. మరో వైపు  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

తిరుపతి, Chittoor, అన్నమయ్య, కర్నూల్ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు.కడప జిల్లాలోని పలు చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.  కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడప జిల్లాలోని దువ్వూరులో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు.

Latest Videos

undefined

నైరుతి  బంగాళాఖాతంలో దక్షిణ Tamilnadu కు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనితో రాయలసీమ,  దక్షిణ కోస్తా, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  రాయలసీమ జిల్లాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. 

Telangana లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకికట్టుగా కూడా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో Bay Of Bengal లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
 

click me!