ఐఎఎస్‌లపై ఏపీ హైకోర్టు సీరియస్: ఉపాధి హామీ బిల్లుల కేసులో హైకోర్టు ఆగ్రహం

By narsimha lode  |  First Published Jun 14, 2022, 7:28 PM IST

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టు ఐఎఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇవాళ ముగ్గురు ఐఎఎస్ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ప్రతి ఆర్డర్ లో కోర్టు ధిక్కార కేసులు నమోదైతే ఎలా అని కోర్టు ప్రశ్నించింది. 


అమరావతి: Mgnrega Case బిల్లుల చెల్లింపులపై Court ధిక్కరణకు కేసులో IAS అధికారులపై AP High Cour మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎఎస్ అధికారులు  గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కోన శశిధర్ లు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఐఎఎస్ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రతి ఆర్డర్ లోనూ కోర్టు ధిక్కార కేసులు నమోదైతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. 

ఇటీవల Kurnool  లో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని Judge ప్రస్తావించారు. బిల్లులు చెల్లించని కారణంగానే నిందితులు Suicide కు పాల్పడినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయని జడ్జి గుర్తు చేశారు.  బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబలకు  ఎవరు ఆసరా కల్పిస్తారని జడ్జి ప్రశ్నించారు. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు ఎలా పనులు చేస్తారని కోర్టు అడిగింది. 
గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మార్చి వరకు CFMS ద్వారా జరిగిన చెల్లింపుల స్టేట్ మెంట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రకారంగా బిల్లులు ఇవ్వడం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుపై విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసిందని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

Latest Videos

undefined

గతంలో ఏపీలో పలువురు ఐఎఎస్ లకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎఎస్ లకు శిక్షలు కూడా విధించింది. 
కోర్టు ధిక్కరణ కేసులో ఐఎఎస్ అధికారి చిన వీరభద్రుడికి కి ఏపీ హైకోర్టు 4 వారాల పాటు జైలు శిక్ష ఈ ఏడాది మే 3న విధించింది.  అంతేకాదు రూ. 2 వేలు జరిమానాను విధించింది.2001లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు BPED చదువుకునేందుకు వీలు కల్పిస్తూ AP High Court ఉత్తర్వులు జారీ చేసింది.  బీపీఈడీ చదువుకునే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీత భత్యాలను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.అయితే కోర్టు ఉత్తర్వుల అమల్లో జాప్యం చేసింది.

 కోర్టు ఉత్తర్వుల అమల్లో జాప్యం చేసినందుకు గాను చినవీరభద్రుడికి  నాలు వారాల Jail శిక్షను విధిస్తూ మంగళవారం నాడు హైకోర్టు తీర్పును చెప్పింది. అంతేకాదు రూ. 2 వేల జరిమానాను విధించింది. ఈ శిక్షను రెండు వారాలు సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ రెండు వారాల్లో ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవచ్చని కూడా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ ఏడాది మార్చి 31న కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఎఎస్ లకు జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టుకు ఐఎఎస్ లు క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. 

విజయ్ కుమార్, గోపాలకృష్ణద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని  ఆదేశాలను హైకోర్టు గతంలో జారీ చేసింది.  అయితే ఈ ఆదేశాలను ఐఎఎస్ లు అమలు చేయలేదు. దీంతో  కోర్టు ధిక్కరణ కింద ఎనిమిది మంది ఐఎఎస్‌లకు  రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది.  

ఈ విషయమై ఐఎఎస్ లు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో  సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్ లను కోర్టు ఆదేశించింది. జైలు శిక్షకు బదలుగా హాస్టల్ విద్యార్ధులకు సేవ చేయాలని సూచించింది.ప్రతి నెల ఏదో ఒక రోజు  సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.

2021 సెప్టెంబర్ మాసంలో కూడా ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ సహా ఐదుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు జరిమానాను విధించింది.

గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని కారణంగా కూడా హైకోర్టు ఈ శిక్ష విధించింది.  తాజాగా ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా జైలు శిక్ష విధించింది. అయితే ఐఎఎస్ లు క్షమాపణ కోరడంతో ఉన్నత న్యాయస్థానం సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది. ఐఏఎస్‌ల‌కు విధించిన సామాజిక సేవా శిక్ష‌ను 8 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేసింది. 

also read:ఎనిమిది మంది ఐఎఎస్‌లకు ఏపీ హైకోర్టు షాక్: కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష, క్షమాపణలు కోరిన ఐఎఎస్‌లు

ఈ తీర్పుపై ఇప్ప‌టికే ఇద్ద‌రు ఐఏఎస్‌లు హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించ‌గా.. వారి శిక్ష‌ను వాయిదా వేస్తూ డివిజ‌న్ బెంచ్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మిగిలిన ఆరుగురు ఐఏఎస్‌లు కూడా హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు.

click me!