ప్రత్యర్ధులు జరిపిన దాడిలో విజయవాడకు చెందిన పుట్ బాల్ ప్లేయర్ ఆకాష్ మరణించాడు. ఆకాష్ శరీరంపై 16 చోట్ల నిందితులు కత్తితో దాడికి దిగారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ: Bejawada నగరంలో ప్రత్యర్ధుల దాడిలో Akash అనే పుట్ బాల్ ప్లేయర్ ను ప్రత్యర్ధులు హత్య చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. ఆకాష్ Football రాష్ట్రస్థాయి ప్లేయర్.
Vijayawada నగరంలోని Barలో జరిగిన వివాదంలో ఆకాష్ హత్యకు దారితీసింది. విజయవాడ గురునానక్ కాలనీలో మంగళవారం నాడు చోటు చేసుకుంది. వాంబే కాలనీలో ఉదయం శంకర్ అలియాస్ టోని అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం Tony డెడ్ బాడీని మంగళవారం నాడు ఉదయం జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.టోని చనిపోయిన విషయం తెలుసుకున్న అనుచరులు ఆసుపత్రికి చేరుకున్నారు. వీరంతా మధ్యాహ్నం పూట జీజీహెచ్ కు సమీపంలోని బార్ లో మద్యం తాగేందుకు వెళ్లారు. టోని అనుచరుల్లో రెండు గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల్లో జక్కంపూడికి చెందిన ఆకాష్ కు మరో వర్గానికి మధ్య గొడవ జరిగింది. ఆకాష్ ప్రత్యర్ధి వర్గానికి చెందిన ఒకరిని కొట్టారు. ఆకాష్ గురునానక్ కాలనీలోని అతని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆకాష్ ఆ సమయంలో మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఆకాష్ తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్ధులు ఆకాష్ ఉన్న రూమ్ కి వచ్చారు. ప్రత్యర్ధులను చూసిన ఇద్దరు పారిపోయారు. ఆకాష్ వద్ద ఉన్న ఒక్కడిని ప్రత్యర్ధులు బెదిరించి బయటకు పంపారు. నిద్రపోతున్న ఆకాష్ ను ప్రత్యర్ధులు Knifeతో పొడిచారు. అరగంట తర్వాత ఆకాష్ స్నేహితులు ఆకాష్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆకాష్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆకాష్ మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. వైద్యులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆకాష్ మృతదేహంపై 16 చోట్ల కత్తిపోట్లున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.