మచిలీపట్నంలో కలకలం... పదిరోజుల పసిగుడ్డుతో సహా తల్లీ, ముగ్గురు బిడ్డల అదృశ్యం

Arun Kumar P   | Asianet News
Published : Jun 01, 2022, 10:39 AM ISTUpdated : Jun 01, 2022, 10:49 AM IST
మచిలీపట్నంలో కలకలం... పదిరోజుల పసిగుడ్డుతో సహా తల్లీ, ముగ్గురు బిడ్డల అదృశ్యం

సారాంశం

ప్రభుత్వాస్పత్రి నుండి పదిరోజుల పసిగుడ్డుతో సహా ముగ్గురు బిడ్డలతో బాాలింత అదృశ్యమైన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకలం రేపుతోంది. 

మచిలీపట్నం: పదిరోజుల పసిగుడ్డుతో సహా మరో ఇద్దరు చిన్నారులు, తల్లి హాస్పిటల్ నుండి అదృశ్యమైన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకలం రేపుతోంది. తల్లీ బిడ్డల ఆఛూకీ కోసం పోలీసులు, కుటుంంబసభ్యులు గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... మచిలీపట్నం దేశాయిపేటకు చెందిన ఆనంద్ కు వ్యక్తి ఇద్దరు పిల్లలు సంతానం. భార్య నిండు గర్భంతో వుండటంతో గత నెల(మే) 21ను  ప్రసవం కోసం మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అదే రోజు ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

అయితే పసిగుడ్డుకు కామెర్ల కారణంగా హాస్పిటల్ లోనే వుంచుకుని చికిత్స అందిస్తున్నారు. ఇలా గత పదిరోజులుగా ఆనంద్ తో పాటు ఇద్దరు పిల్లలు, పసిగుడ్డు, తల్లి హాస్పిటల్లోనే వుంటున్నారు. రోజుకోసారి ఆనంద్ ఇంటికి వెళ్లి బార్యా పిల్లలకు భోజనం తీసుకుని వచ్చేవాడు. 

ఇలా నిన్న(మంగళవారం) కూడా ముగ్గురు పిల్లలు, భార్యను హాస్పిటల్లో వదిలి ఆనంద్ భోజనం తేవడానికి ఇంటికెళ్లాడు. అతడు తిరిగివచ్చేసరికి భార్యాబిడ్డలు కనిపించలేదు. హాస్పిటల్ మొత్తం వెతికినా వారి జాడ కానరాలేదు. దీంతో అతడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. 

ఆనంద్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీ బిడ్డల కోసం గాలింపు చేపట్టారు. తల్లీబిడ్డల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు. హాస్పిటల్ తో పాటు పరిసరాల్లోని సిసి కెమెరాల ఆదారంగా తల్లీబిడ్డలు ఏమయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డలను తీసుకుని తల్లే ఎక్కడికైనా వెళ్లిపోయిందా లేక ఎవరైనా వీరికి కిడ్నాప్ చేసారా అన్నది తెలియడంలేదు. ఏదేమైనా ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అధృశ్యం మచిలీపట్నంలో కలకలం రేపుతోంది. 

ఇక ఇటీవల ఇలాగే తిరుమల కొండపై అదృశ్యమైన బాలుడు 48గంటల తర్వాత తల్లిచెంతకు చేరాడు. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మహారాష్ట్ర లాతూరు నుండి వచ్చిన ప్రశాంత్ జీ యాదవ్, స్నేహ దంపతు కుమారుడు వీరేశ్ కిడ్నాప్ కు గురయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొండపై వున్న సీసీ కెమెరాలను పరిశీలించి ఆ ఫుటేజ్ ద్వారా ఓ వ్యక్తి బాలున్ని ఎత్తుకుపోవడం గమనించారు. అతడి ఊహాచిత్రాన్ని గీయించి దేశవ్యాప్తంగా ప్రచారం చేసారు. 

ఈ క్రమంలోనే మహారాష్ట్రలో నిందితుడి పోలీకలతో ఉన్న వ్యక్తి సంచరిస్తున్నాడని చిత్తూరు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమై ఆరు బృందాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేయగా మహూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబు ఆచూకీ తెలిసింది. నిందితుడు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన విశ్వంభరగా గుర్తించారు. అతడి నుండి బాబును తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమయ్యింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!