అనంతపురం కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాప్ ఖాళీ చేయమంటే.. దాడి చేసి...

Published : Jun 01, 2022, 11:08 AM IST
అనంతపురం కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాప్ ఖాళీ చేయమంటే.. దాడి చేసి...

సారాంశం

అనంతపురం కోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో జడ్జి గమనించడంతో అతడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

అనంతపురం : anantapurలోని తపోవనానికి చెందిన నారాయణ స్వామి మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో suicide attempt చేశాడు. వివరాల్లోకి వెడితే.. నగరంలోని ప్రశాంతినగర్ కు చెందిన జి. ఆదినారాయణకు బళ్లారి బైపాస్ ప్రాంతంలో స్థలం ఉంది. ఈ స్థలంలోని షెడ్డులో నారాయణస్వామి కూల్ డ్రింక్ షాప్ నడుపుతున్నాడు. వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. గత నెల 5న షెడ్డు వద్ద నారాయణ స్వామి, కుటుంబసభ్యులు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో ఆదినారాయణ, అతని కుమారుడు నవీన్ కుమార్ అక్కడికి వెళ్లారు. షాపు ఖాళీ చేసి తీరాలంటూ గట్టిగా హెచ్చరించారు. 

ఆ సమయంలో నవీన్ కుమార్ మీద నారాయణ స్వామి కుమారుడు పవన్ దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణస్వామి, ఆయన భార్య అంజినమ్మ, కుమారుడు పవన్ మీద ఐపీసీ 324 సెక్షన్ కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఊండ్ సర్తిఫికెట్ ఆధారంగా మరో సెక్షన్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ విషయంగా విచారణకు స్టేషన్ కు రావాలని నిందితులకు సూచించారు. అప్పటినుంచి నిందితులు అందుబాటులో లేకుండా పోయారు. మంగళవారం ఉదయం కోర్టు ఆవరణలో నారాయణస్వామి, అంజినమ్మ ప్రత్యక్షమయ్యారు. 

నారాయణస్వామి తన వెంటన తెచ్చుకున్న పురుగుల మందు తాగి జడ్జి ఓంకార్ ముందుకెళ్లి రూరల్ పోలీసులు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయాడు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి ఆదేశాల మేరకు.. కోర్టు సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై నారాయణస్వామిని ఆటోలో సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

కాగా, ఇలాంటి ఘటనే మే 30న భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకి పాల్పడిన ఘటన Bhadradri Kottagudem జిల్లా అశ్వాపురంలో చోటుచేసుకుంది. అశ్వాపురానికి చెందిన అప్పారావు  స్థానికంగా Chitti వేస్తున్నాడు. నిర్వాహకులకు కొన్ని నెలలుగా డబ్బులు చెల్లించడం లేదు. ఈ విషయమై వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు పిలిపించి మాట్లాడారు. శనివారం సాయంత్రం అప్పారావు లేని సమయంలో అతని ఇంటికి చిట్టీ నిర్వాహకులు వెళ్లి.. డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు.

చిట్టీల నిర్వాహకులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పారావు భార్య ఫిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం అప్పారావు అశ్వాపురం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. గతంలో కూడా తన సోదరి, తన కుటుంబంపై చిట్టి నిర్వాహకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. ఇప్పుడైనా న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్యకు పాల్పడతానని వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసుకున్నాడు.  స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేసిన తరువాత 108 వాహనంలో  భద్రాచలం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.  ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్