టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు దోమలు కుడుతున్నాయని, అనారోగ్యం బారిన పడే ముప్పు ఉన్నదని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది వరకు ఓ రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మరణించినట్టు చెప్పాయి. దీంతో అధికారులు జైలు చుట్టూ ఫాగింగ్ చేయించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి అరెస్టు ఎపిసోడ్ ఇంకా మండుతూనే ఉన్నది. చంద్రబాబు అరెస్టు విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఆరోపణ, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇందులో ఎవరూ ఊహించని ఓ అంశం ముందుకు వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడద ఎక్కువ ఉన్నదని, దోమలతో ఆయన ఆరోగ్యానికి నష్టం జరగవచ్చనే అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల నుంచి ఈ వాదనలు వచ్చాయి.
కొన్ని మీడియా సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి.. ఇది కుట్రేనా? అన్నట్టుగా రిపోర్ట్ చేశాయి. దీంతో దోమల విషయం సీరియస్‌గానూ, ట్రివియల్‌గానూ చర్చనీయాంశమైంది. ఈ గొడవ గాలివానగా మారే సంకేతాలు రావడంతో జైలు అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
చంద్రబాబు నాయుడికి దోమలు కుడుతున్నాయని, ఆయన అనారోగ్యానికి గురయ్యే ముప్పు ఉన్నదని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు వాదించాయి. ఇదే జైలులో ఓ రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ వారి వాదనను బలంగా వినిపిస్తున్నారు. దీంతో జైలు అధికారులు రాజమండ్రి జైలు చుట్టూ ఫాగింగ్ చేయించారు.
Also Read: పూరీ జగన్నాథ్ బర్త్ డే.. ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి స్పెషల్ పోస్టర్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.!
రాజమండ్రి జైలు చుట్టూ పెద్ద వృక్షాలు, పొదలు ఉన్నాయి. దీంతో దోమలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, జైలు అధికారులు జైలు చుట్టూ మున్సిపల్ సిబ్బందితో ఫాగింగ్ చేయించారు.. ఆ చెట్ల పొదల్లోనూ ఫాగింగ్ చేసినట్టు సమాచారం. జైలులోని ఖైదీల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.