చంద్రబాబును జైల్లో పెట్టడం మాకూ బాధగానే వుంది..: మంత్రి అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar P  |  First Published Sep 28, 2023, 10:27 AM IST

అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్... ఈ వయసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం తమకు కూడా బాధగానే వుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు  


పల్నాడు : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్... ఆ వయసులో జైలుకు వెళ్లడం తమకుకూడా బాధగానే వుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కానీ చట్టానికి ఎవరూ అతీతులు కారని... తప్పుచేసిన వారికి శిక్ష తప్పదన్నారు. చట్టం హోదాను, వయసు చూడదని... తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళ్లాడని అంబటి రాంబాబు అన్నారు. 

పల్నాడు జిల్లా అచ్చంపేటలో నిర్మించిన నూతన మోడల్ పోలీస్ స్టేషన్ ను హోమ్ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఇతర ప్రజాప్రతినిధలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.  

Latest Videos

వీడియో

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేశాడు కాబట్టే సెంట్రల్ జైలుకు వెళ్ళాడని మంత్రి అన్నారు. దేశంలో ఒక్క చంద్రబాబే కాదు అనేక మంది ముఖ్యమంత్రులు,మాజీ ముఖ్యమంత్రులు జైలుకెళ్ళారని అన్నారు. ముఖ్యమంత్రులుగా చేసినవారంతా జైలుకు వెళ్లరు... అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడతారో వారు జైలుకెళ్ళక తప్పదన్నారు. ముఖ్యమంత్రులే కాదు దేశ ప్రధాని కూడా చట్టాలకు అతీతులు కాదని అంబటి రాంబాబు అన్నారు. 

Read More  ఫైబర్ నెట్ కుంభకోణాన్ని 2016లోనే సీఎం జగన్ బయటపెట్టారు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు చంద్రబాబు కాంగ్రెస్ లో వున్నారని... టిడిపి గెలవగానే ఈ  పార్టీలో చేరాడని మంత్రి అన్నారు. చివరకు సొంత మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని మోసం చేసాడని... బామ్మర్దులు, తోడల్లుడికి ఈ మోసం నచ్చిందన్నారు. ఇలా అడ్డదారిలో ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న చంద్రబాబు అవినీతి, అక్రమాలతో ప్రజలను కూడా మోసం చేసాడు... ఎంత మోసగాడయ్యా వాడు అంటూ అంబటి మండిపడ్డారు. 

గత టిడిపి ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను మాత్రమే జగన్ సర్కార్ బయటపెడుతోంది... ఎవరిపైనా తమకు కక్ష లేదన్నారు. ఎప్పటికయినా ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. 

click me!