ఉదయనిధిని చెప్పుతో కొట్టినవారికి రూ.10 లక్షలు..: విజయవాడలో వెలిసిన ప్లెక్సీలు (వీడియో)

By Arun Kumar P  |  First Published Sep 7, 2023, 11:56 AM IST

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ సెగ తాజాగా విజయవాడను తాకింది. 


విజయవాడ : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తమిళ మంత్రి వ్యాఖ్యలు వున్నాయంటూ బిజెపి నాయకులతో పాటు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యల సెగ తాజాగా విజయవాడను తాకింది. 

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ను చెప్పుతో కొట్టినవారికి రూ.10 లక్షల బహుమతి ఇవ్వబడును అంటూ విజయవాడలో ప్లెక్సీలు వెలిసాయి. ఉదయనిధి ఫోటోను చెప్పతో కొడుతున్నట్లుగా వున్న ప్లెక్సీని జన జాగరణ సమితి ఏర్పాటుచేసింది. ఈ ప్లెక్సీలు విజయవాడలోని ప్రధాన కూడళ్ళు, రోడ్ల పక్కన దర్శనమిస్తున్నారు. వీటిని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నారు. 

Latest Videos

undefined

వీడియో

ఇదిలావుంటే సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై అయోధ్య స్వామీజీ పరమహంస ఆచార్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉదయనిధి తల నరికిన వారికి భారీ నగదు బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేసారు. ఉదయనిధి శిరచ్చేదంపై మొదట రూ.10 కోట్లు ప్రకటించిన పరమహంస స్వామి అవి చాలకుంటే మరికొంత ఇస్తానని ప్రకటించారు.హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని అయోధ్య స్వామీజీ హెచ్చరించారు. 

Read More  ఉదయనిధి సనాతన వ్యాఖ్యలపై సరైన సమాధానాలు ఇవ్వాలి: మంత్రులకు ప్రధాని మోడీ సూచన

అయితే ఉదయనిధి ఫోటోను కత్తితో చించడం, ఫోటోను కాల్చివేయడమే కాదు రెచ్చగొట్టే ప్రకటన చేసిన పరమహంస ఆచార్యపై మధురై పోలీసులు కేసు నమోదు చేసారు. తమిళనాడులో ఉద్రిక్తతలు సృష్టించేలా పరమహంస వ్యాఖ్యలు వున్నాయని... మంత్రిని చంపుతామని బెదిరించారంటూ అయోధ్య స్వామిపై కేసు నమోదయ్యింది. 

ఇక ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. బిజెపితో పాటు మరికొన్ని పార్టీలు, నాయకులు ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుంటే మరికొన్ని పార్టీలు, నాయకులు మద్దతుగా నిలస్తున్నారు. ఇలా మంత్రి ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. 

click me!