ఏపీ అసెంబ్లీ నుండి ఐదుగురు టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు స్పీకర్. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ నుండి ఐదుగురు TDP ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ Tamineni Sitaram ప్రకటించారు.బుధవారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత Jangareddy Gudem మరణాలపై చర్చను కోరుతూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చిడతలు వాయిస్తూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యులేనా మీరు అంటూ ఆయన ఫైరయ్యారు. మీకు ఓటేసిన సభ్యులు మిమ్మల్ని గమనిస్తున్నారని స్పీకర్ చెప్పారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు ఇవాళ కూడా ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చిడతలు పట్టుకొని నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని పలువురు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించడంపై స్పీకర్ టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో ఇవాళ టీడీపీ సభ్యులు చిడతలు వాయించిన అంశాన్ని ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకు వెళ్లనున్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్ వేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన అంశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును స్పీకర్ తప్పు బట్టారు.ఈ రెండు అంశాలను అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాగుతున్న తరుణంలో జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.ప్రతి రోజూ అసెంబ్లీలో నిరసనకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు సెషన్ మొత్తం సస్పెండ్ అయ్యారు. గత వారంలో ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. నిన్న నలుగురు టీడీపీ సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. ఇవాళ కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.చిడతలు పట్టుకొని కూడా టీడీీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు.
జంగారెడ్డి గూడెం మరణాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని లు కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. సహజ మరణాలను కూడా కూడా రాజకీయంగా తమ ప్రయోజనం కోసం టీడీపీ వక్రీకరిస్తుందని టీడీపీై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. అయితే జంగారెడ్డిగూడెం మరణాలు సహజ మరణాలు కావని టీడీపీ వాదిస్తుంది. ఏపీ అసెంబ్లీలో గత సమావేశాల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో తాను అసెంబ్లీకి హాజరు కానని చంద్రబాబు శపథం చేశారు. సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించారు. దీంతో ఈ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అయితే జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగుతున్నారు. ఈ విషయమై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబుడుతున్నారు. ఇదే విషయమై చర్చ కోరుతన్నారు. కానీ చర్చ కోరుకొనే టీడీపీ సభ్యలు మరో రూపంలో రావాలని అధికార పక్షం వాదిస్తుంది.