ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

Published : Aug 30, 2021, 07:12 AM IST
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

సారాంశం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఎస్ వాహనం ఒంగోలు - కర్నూలు రహదారిపై పడి ఉన్న గేదె మృతదేహంపైకి ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తుర్లపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు - కర్నూలు రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 

రోడ్డు మీద పడి ఉ్న గేదె కళేబరంపైకి టాటా ఎస్ వాహనం ఎక్కింది. దీంతో వాహనం బోల్తా పడింది. దీంతో ఐదుగురు మరణించగా, మరికొంత మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

గాయపడినవారిని మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, కోటమ్మ, వాహనం డ్రైవర్ వెంకటేశ్వర రెడ్డిగా గుర్తించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలోని ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాజం చోటు చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?