వారానికి 5 రోజుల పనిదినాలపై ఏపీ సర్కార్ స్పష్టత.. ఏడాది పాటు పొగడిస్తూ ఉత్తర్వులు..

By Sumanth KanukulaFirst Published Jun 30, 2022, 3:57 PM IST
Highlights

సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారానికి 5 పనిదినాలు విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారానికి 5 పనిదినాలు విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఉన్న విధంగానే.. సచివాలయ, హెచ్‌ఓడీ ఆఫీసుల ఉద్యోగుల వారానికి ఐదు రోజులే పనిచేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పాలన అమరావతి నుంచి సాగిస్తున్నప్పటీ నుంచి సచివాలయం,హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసలుబాట్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే. సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసులుబాటు ఇచ్చారు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

2016లో ఈ విధానాన్ని ప్రారంభించగా.. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. అయితే ప్రతిసారి ఏడాది పాటు ఈ విధానాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. గత పొడిగింపు ప్రకారం ఈ విధానం సోమవారం (జూన్ 27)తో ముగిసింది. అయితే ఈ లోపు ఈ విధానం పొడగింపుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఈ శనివారం విధులకు హాజరయ్యే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐదు రోజుల పనిదినాల విధానం పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 

click me!