నందం సుబ్బయ్య హత్య కేసులో ఐదుగురు అరెస్ట్ : ఎస్పీ అన్బురాజన్

By AN TeluguFirst Published Dec 31, 2020, 4:11 PM IST
Highlights

కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యకేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇందులో కుంభా రవి ఏ1 నిందితుడని పేర్కొన్నారు. 

కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యకేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇందులో కుంభా రవి ఏ1 నిందితుడని పేర్కొన్నారు. 

కుంభా రవికి నందం సుబ్బయ్యకు మధ్య పాత గొడవలు ఉన్నాయని, ఆరేళ్ల నాటి విషయమై మరోసారి ఘర్షణ పడ్డారని, ఈ ఘర్షణే సుబ్బయ్య హత్యకు దారితీసిందని వివరించారు. రవితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశామని, సుబ్బయ్య హత్యకేసును పారదర్శకంగా విచారణ చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. 

కాగా, సుబ్బయ్య హత్యకేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది, మునిసిపల్ కమిషనర్ల పేర్లను కూడా చేర్చాలని కోరుతూ నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిన్న ప్రొద్దుటూరులో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో, కోర్టును సంప్రదించి ఆ ముగ్గురు పేర్లను చేర్చే అంశం పరిశీలిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

సుబ్బయ్య హత్యతో సంబంధం... ప్రొద్దుటూరు కమీషనర్ ఏమన్నారంటే...

ఈ నెల 29వ తేదీన ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యపై  వైఎస్ఆర్‌సీపీపై బాధిత కుటుంబం ఆరోపణలు చేసింది.ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై  సుబ్బయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే సుబ్బయ్య హత్యకు గురికావడం ప్రొద్దుటూరులో రాజకీయంగా కలకలం రేపుతోంది.

తన భర్త హత్యకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావమరిది మునిరెడ్డి, ప్రొద్దుటూరు పురపాలిక కమిషనర్‌ రాధ  కారణమని మృతుడి భార్య ఆరోపించారు.ఈ మేరకు ఆమె పోలీసులకు  చేసిన ఫిర్యాదులో వారి పేర్లను పేర్కొంది.

 ఇళ్ల పట్టాలను పంపీణీ చేసే స్థలంలోనే సుబ్బయ్యను హత్యకు గురయ్యాడు. కళ్లలో కారం కొట్టి సుబ్బయ్యను నరికి చంపారు.  సుబ్బయ్య మొబైల్ ఫోన్ కన్పించడం లేదు.హత్య జరిగిన స్థలానికి సుబ్బయ్య ఎందుకు వెళ్లాడు... ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారనే విషయమై విచారణ చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన బావ మరిది, కమీషనర్ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చాలని ఆమె కోరుతున్నారు.

click me!