
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేదీ జరగలేదు. కానీ రెండు లక్షల రూపాయల విలువ చేసే చేపలు, ఇతర సామగ్రి సముద్రంలో కొట్టుపోయాయి.
ఆరుగురు జాలర్లు చేపలను పట్టుకుని తిరిగి వస్తుండగా రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడింది.బోటులోని ఆరుగురు జాలర్లు ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 50 మంది జాలర్లు రంగంలోకి దిగి బోటును ఒడ్డుుక చేర్చారు. తీరానికి 500 మీటర్ల దూరంలో బోటు ప్రమాదం సంభవించింది.
గత మూడు నెలలుగా సముద్రంలో వేటపై నిషేధం విధించారు. ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలోకి పడవలను అనుమతించలేదు. అయితే గత మూడు రోజులుగా మత్స్యకారులు తిరిగి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లడం ప్రారంభించారు.