దండుపాళ్యం ముఠా అరెస్ట్: ఆరు హత్యలు, మరో పది మంది హత్యకు రెక్కీ

Published : Jun 24, 2021, 10:32 AM IST
దండుపాళ్యం ముఠా అరెస్ట్: ఆరు హత్యలు, మరో పది మంది హత్యకు రెక్కీ

సారాంశం

విజయవ ాడలో పోలీసులు దండుపాళ్యం ముఠాను అరెస్టు చేశారు. గత రెండేళ్లలో ఆరుగురిని హత్య చేసిన ముఠా మరో పది మంది హత్యకు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పోలీసులు దండు పాళ్యం ముఠాను అరెస్టు చేశారు. తద్వారా వరుస హత్యలకు బ్రేక్ వేశారు. దండుపాళ్యం ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని గోపిరాజు, చంటి, ప్రభుకుమార్, ఫణి, చక్రవర్తులుగా గుర్తించారు. 

గత రెండేళ్లలో వారు రెండేళ్లలో ఆరు హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై ఏడు కేసులు నమోదై ఉన్నాయి. మరో పది మంది హత్యకు వారు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వచ్చే రెండు నెలల్లో వారిని హత్య చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది.

కంచికచర్ల జంట హత్యలు కూడా వారే చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎంటిఎం చోరీకి యత్నిస్తూ వారు పోలీసులకు చిక్కారు. దానిపై విచారణ జరుపుతుండగా వారు చేసిన హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.

ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారిని హత్య చేసి నగలు, నగదు దోచుకుంటూ వస్తున్నారు. పగలు ఆటో డ్రైవర్లు పనిచేస్తూ లక్ష్యాలను గుర్తించి రాత్రిపూట దాడులు చేసి హత్యలు చేసి దోపిడీకి పాల్పడుతున్నట్లు వారు గుర్తించారు. నిందితులంతా 25 ఏళ్ల లోపు వయస్సు గలవారే.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu