ట్రయాంగిల్ లవ్: లవర్‌ను రెండో పెళ్లి చేసుకొన్న మహిళ: చంపిన మొదటి భార్య

Published : Feb 14, 2021, 10:29 AM IST
ట్రయాంగిల్ లవ్: లవర్‌ను రెండో పెళ్లి చేసుకొన్న మహిళ: చంపిన మొదటి భార్య

సారాంశం

అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకొంది. తన భర్తను రెండో పెళ్లి చేసుకొందనే అక్కసుతో ఓ మహిళను వివాహిత హత్యచేసింది. 


రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకొంది. తన భర్తను రెండో పెళ్లి చేసుకొందనే అక్కసుతో ఓ మహిళను వివాహిత హత్యచేసింది. 

అనంతపురం జిల్లా రాయదుర్గం పోచమ్మ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకొంది. రాయదుర్గంలోని పాతబస్తీకి చెందిన హరిబౌలికి చెందిన కర్నె భాస్కర్ కు జానకితో పెళ్లైంది. వీరిద్దరూ రాయదుర్గంలో నివసిస్తున్నారు.  

భాస్కర్ అమీన్‌పూర్ కు చెందిన స్రవంతితో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. స్రవంతి తన భర్తతో మూడేళ్ల క్రితం విడాకులు తీసుకొంది. భర్తతో విడాకులు తీసుకొన్న స్రవంతిని భాస్కర్ గత ఏడాది పెళ్లి చేసుకొన్నాడు. స్రవంతి ప్రస్తుతం ఆరు మాసాల గర్భవతి. 

భాస్కర్ మొదటి భార్య, జానకికి స్రవంతికి మధ్య కలతలు చెలరేగాయి.  దీంతో స్రవంతిని అడ్డు తొలగించుకోవాలని జానకి భావించింది. దీంతో జానకి తనకు వరుసకు తమ్ముడైన గుండా లక్ష్మీనారాయణ కృష్ణప్రసాద్ సహకారం తీసుకొంది.

స్రవంతిని తన ఇంటికి రావాలని జానకి ఈ నెల 10వ తేదీన ఫోన్ చేసి పిలిచింది. స్రవంతి వచ్చే విషయం భర్తకు తెలియదు.  స్రవంతి ఇంటికి వచ్చేలోపుగా భర్తకు నిద్రమాత్రలు కలిపిన టీ ఇచ్చింది జానకి.నిద్ర మాత్రలు కలిపిన టీ తాగిన భాస్కర్ మత్తులోకి జారుకొన్నాడు. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన స్రవంతితో జానకి కొద్దిసేపు మాట్లాడింది.

ఆ తర్వాత తన సోదరుడు లక్ష్మీనారాయణ సహకారంతో  చున్నీతో గొంతుకు ఉరేసి చంపింది. భర్త నిద్రించిన గదికి పక్కనే మరో గదిలో మృతదేహాన్ని దాచి పెట్టారు. స్రవంతి ఎంతకి ఇంటికి రాకపోవడంతో భాస్కర్ కు ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేసి సమాచారం చెప్పారు. విషయం తెలుసుకొన్న భాస్కర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

భాస్కర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకొన్న లక్ష్మీనారాయణ పోలీసులకు లొంగిపోయాడు.జానకి, భాస్కర్ లు కూడ పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. జానకి బతికి ఉండగానే స్రవంతిని ఏడాది క్రితం భాస్కర్ పెళ్లి చేసుకొన్నాడు. స్రవంతిని కూడ భాస్కర్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్