ఆనందయ్య మందుపై తొలి దశ అధ్యయనం పూర్తి... సీసీఆర్ఏఎస్‌ నిర్ణయంపై ఉత్కంఠ

By Siva Kodati  |  First Published May 26, 2021, 6:30 PM IST

ఆనందయ్య మందుపై మొదటి దశ పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు స్టడీ పూర్తి చేశారు తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యులు. ఆనందయ్య మందు తీసుకున్న 570 మంది నుంచి వైద్యులు వివరాలు సేకరించారు


ఆనందయ్య మందుపై మొదటి దశ పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు స్టడీ పూర్తి చేశారు తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యులు. ఆనందయ్య మందు తీసుకున్న 570 మంది నుంచి వైద్యులు వివరాలు సేకరించారు. తిరుపతి వైద్యులు 270 మందితో, విజయవాడ వైద్యులు 300 మందితో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అందరి వివరాలను ఆన్‌లైన్‌లో సీసీఆర్ఏఎస్‌కు అప్‌లోడ్ చేశారు అధికారులు. రోగుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్న దానిపై నోరు మెదపడం లేదు ఆయుర్వేద అధికారులు. రేపటిలోగా సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు జారీ చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 

మరోవైపు ఆనందయ్య మందును జంతువులపై ప్రయోగించాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగాలకు  సృజన లైఫ్ ల్యాబ్  పనికొస్తోందా అనే విషయమై ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై ఇప్పటికే జాతీయ పరిశోధన సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని, జంతువులకు విడతలవారీగా ఆనందయ్య మందు ఇచ్చి చూస్తామని సైంటిస్టులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

Also Read:ఆనందయ్య మందుపై అధ్యయనంలో అవాంతరాలు: ఆ తర్వాతే క్లినికల్ ట్రయల్స్

గత 15 ఏళ్లుగా పలు మందుల విషయంలో తమ ల్యాబ్‌లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెప్పారు.కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జంతువుకు కరోనా సోకించి పరీక్ష చేసే వ్యవస్థ తమ దగ్గర లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.అయితే ఈ ప్రయోగాలకు కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు.ఇప్పటికే ఆనందయ్య మందు తీసుకొన్న వారి డేటా సేకరించే పనిలో విజయవాడ, తిరుపతి ఆయుర్వేద వైద్యులున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాతే జంతువులపై ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంది.

click me!