శ్రీశైలంలో తొలి కరోనా కేసు: ఆలయ సెక్యూరిటీ గార్డ్‌కు కరోనా, ఉలిక్కిపడ్డ అధికారులు

By Siva KodatiFirst Published Jul 7, 2020, 12:31 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రాలను సైతం కోవిడ్ వదలడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పలు ఆలయాలను సైతం మూసివేశారు. తాజాగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో తొలి కరోనా కేసు నమోదవ్వడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.

Also Read:ఏపీలో 20 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: 239 మంది మృతి

దేవస్థానం సమీపంలోని సున్నిపెంట గ్రామంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు శ్రీశైలం దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి కాగా, మరోకరు సున్నిపెంట లంబాడి తండాకు చెందినవారు. రంగంలోకి దిగిన అధికారులు వీరిద్దరిని కర్నూలులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

ఈ ఘటనతో శ్రీశైలం ఆలయం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. అలాగే పాజిటివ్‌గా తేలిన సెక్యూరిటీ గార్డ్‌తో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారన్న దానిపై దేవస్థానం అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు  ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 20 వేల మార్కు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 239 మంది కోవిడ్ -19తో మరణించారు. 

click me!