మహిళలంటే టీడీపీకి ఉన్న ప్రేమ ఇదేనా?: వాసిరెడ్డి పద్మ

By narsimha lodeFirst Published Jul 7, 2020, 11:31 AM IST
Highlights

మహిళల పేరుతో పట్టాలు ఇస్తోంటే టీడీపీ అడ్డుకొంటుందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
 

అమరావతి:మహిళల పేరుతో పట్టాలు ఇస్తోంటే టీడీపీ అడ్డుకొంటుందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

మంగళవారం నాడు ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు.పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ఇదేనా టీడీపీకి మహిళలపై ఉన్న ప్రేమ అని ఆమె ప్రశ్నించారు.

అమ్మ ఒడి ద్వారా మహిళల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తోన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  రాష్ట్రంలో  మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ లు తీసుకొచ్చిన విషయాన్ని ఆమె తెలిపారు.

తమకు మహిళలంటే ప్రేమ అని చెప్పుకొనే టీడీపీ నేతలు ఇళ్లపట్టాల పంపిణీని అడ్డుకోవడం ద్వారా ఏం చెబుతారని ఆమె ప్రశ్నించారు. మహిళలు అభివృద్ధి చెందితే సమాజం కూడ అభివృద్ది చెందుతోందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను తీసుకొచ్చిందన్నారు. 

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయకుండా టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకొన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


 

click me!