విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..

By team teluguFirst Published Nov 20, 2022, 6:43 AM IST
Highlights

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కన్వేయర్ బెల్ట్స్ లో కొంత భాగం కాలిపోయింది. 

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లోని ఓర్‌ అండ్‌ ఫ్లక్స్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ జంక్షన్‌ హౌస్‌ సమీపంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. పీపీ రోడ్డు, సింటర్ ప్లాంట్ ను కలిపే రహదారికి ఆనుకుని ఉన్న కన్వేయర్ సీవో -37ఏ టేక్ - అప్ ప్రాంతంలో ఉదయం 9:45 గంటలకు మంటలు సంభవించాయి.

కాశీ-తమిళనాడు రెండూ సంస్కృతి, నాగరికతకు శాశ్వత కేంద్రాలు: ప్రధాని మోడీ

ఈ ఘటన సమాచారం అందుకున్న వీఎస్ పీ (విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌)కి చెందిన సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక దళం వెంటనే వచ్చి 30 నిమిషాల్లో దానిని ఆర్పింది. అయితే ఈ ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ లో పని చేస్తున్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కన్వేయర్ బెల్ట్‌లో కొంత భాగం కాలిపోయింది. దీంతో కన్వేయర్లను పునరుద్దరించే పనులు చేపట్టారు.

కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్

మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. బీ-షిఫ్ట్ ముగిసే సమయానికి కన్వేయర్ మళ్లీ పనిలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా దిగువ యూనిట్‌కు సరఫరా కొనసాగింది. దీని వల్ల ఉత్పత్తికి ఎలాంటి నష్టమూ జరగలేదు. రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  కాగా ప్రస్తుతం కన్వేయర్ల మెయింటెన్స్ ఓ ప్రైవేట్ కంపెనీ చూసుకుంటోంది. తాజా ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని ఆ కంపెనీ నుంచే వసూలు చేస్తారని తెలుస్తోంది.

click me!