పత్తికొండలో వైసీపీ శ్రేణుల వెరైటీ నిరసన.. చంద్రబాబు వెళ్లిన రూట్‌లో పసుపు నీళ్లతో శుద్ధి

By Siva KodatiFirst Published Nov 19, 2022, 9:49 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న వైసీపీ శ్రేణులు వెరైటీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పత్తికొండలో చంద్రబాబు పర్యటించిన మార్గాన్ని వైసీపీ నేతలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేస్తున్నారు.
 

కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే 2024లో జరిగే ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. అటు కర్నూలు జిల్లాలో ఆయన పర్యటనను వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. తాజాగా పత్తికొండలో చంద్రబాబు పర్యటించిన మార్గాన్ని వైసీపీ నేతలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు అధికార పార్టీ శ్రేణులు పసుపు నీళ్లు చల్లాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు చూశారని సెటైర్లు వేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకి అంత కోపం ఎందుకు వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లా బాబుకు కూడా చెప్పు చూపించాలనే కోరిక వున్నట్లుందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనే దానిపై బాబు సమాధానం చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. వికేంద్రీకరణపై చంద్రబాబు ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Also REad:40 ఇయర్స్ ఇండస్ట్రీకి కోపమొచ్చింది... పవన్‌లా చెప్పు చూపించాలని ఉందేమో : బాబుపై సజ్జల వ్యాఖ్యలు

న్యాయ రాజధానిపై మీ వైఖరేంటని అడిగితే బాబు సమాధానం చెప్పలేదని.. పైగా ఎదురు దాడి చేశారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని రామకృష్ణారెడ్డి నిలదీశారు. ప్రజల ప్రశ్నలను డైవర్ట్ చేయడానికే బాబు తిట్ల పురాణం మొదలుపట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలను, పోలీసులను తిడుతున్నారని.. నాశనమైపోతారని శాపనార్ధాలు పెడతారని సజ్జల దుయ్యబట్టారు. అధికారం తనకు హక్కు అయినట్టు మాట్లాడుతున్నారని.. రౌడీలకు రౌడీనని ఎలా అంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆ బరి తెగింపు ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

click me!