దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో చెలరేగిన మంటలు.. కుప్పం రైల్వే స్టేషన్‌లో నిలిపివేత.. పరుగులు తీసిన ప్రయాణికులు..

Published : Nov 27, 2022, 01:39 PM IST
దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో చెలరేగిన మంటలు.. కుప్పం రైల్వే స్టేషన్‌లో నిలిపివేత.. పరుగులు తీసిన ప్రయాణికులు..

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. 

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో రైలును రైలును కుప్పం రైల్వే స్టేషన్‌లో ఆపారు. వెంటనే రైలులోని ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

విజయవాడలో కారు ధరకే 2BHK ప్లాట్స్... భవిష్యత్ లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం
Rain Update:తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే! | Weather Update | Asianet News Telugu