
విజయనగరం జిల్లాలో (vizianagaram district ) భారీ అగ్ని ప్రమాదం (fire accident) సంభవించింది. శుక్రవారం మెంటాడ మండలం (Mentada mandal) జక్కువలస (Jakkuvalasa) లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దాదాపు 20 పూరిళ్లు దగ్ధమైనట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.