ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం: చూస్తుండగానే కాలి బూడిదైన రూ.32లక్షలు

Siva Kodati |  
Published : Apr 11, 2021, 08:37 PM ISTUpdated : Apr 11, 2021, 08:38 PM IST
ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం: చూస్తుండగానే కాలి బూడిదైన రూ.32లక్షలు

సారాంశం

ఏపీలోని అనంతపురం జిల్లా పామిడిలోని ఎస్‌బీఐ ఏటీఎం గదిలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై పక్క దుకాణాలకు, నివాసాలకు విస్తరించకుండా అదుపు చేసే యత్నం చేశారు

ఏపీలోని అనంతపురం జిల్లా పామిడిలోని ఎస్‌బీఐ ఏటీఎం గదిలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై పక్క దుకాణాలకు, నివాసాలకు విస్తరించకుండా అదుపు చేసే యత్నం చేశారు.

అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్ మంటలను పూర్తిగా ఆర్పివేసింది. అప్పటికే ఆ గదిలోని 2 ఏటీఎంలు, ఓ నగదుజమ యంత్రం, 2 కోడింగ్‌ యంత్రాలు, 2 ఏసీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

అలాగే ఏటీఏంలలోని రూ.32 లక్షలూ బూడిదైనట్లు ఎస్‌బీఐ మేనేజరు తెలిపారు. ప్రమాదం కారణంగా రూ.44 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే